మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 27
దేశ సమగ్రత, శాంతి భద్రతల పరిరక్షణలో మహోన్నతమైన సేవలు అందిస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్లకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయడం, దేశ అంతర్గత భద్రతను కాపాడడంలో సీఆర్పీఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన కొనియాడారు.
దేశ సమగ్రత, శాంతి భద్రతల పరిరక్షణలో మహోన్నతమైన సేవలు అందిస్తూ, ధైర్యం, క్రమశిక్షణ, త్యాగానికి ప్రతీకగా నిలుస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) వీర జవాన్లందరికీ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు శుభాభినందనలు తెలిపారు.
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, దేశ అంతర్గత భద్రతను కాపాడడంలో సీఆర్పీఎఫ్ ఎల్లప్పుడూ ముందంజలో నిలిచిందని ఆయన అన్నారు.
దేశ ప్రజల భద్రత కోసం సేవ దృక్పథం, విధేయతతో నిరంతరం విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ దళాల సేవలు ప్రతి పౌరుడికి గర్వకారణమని, వారి అంకితభావం, దేశభక్తి, నిస్వార్థ సేవా తత్వం యువతకు స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.












