ఖానాపూర్, 2026-08-27
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యల సాధన కోసం ఈ నెల 27వ తేదీన ఖానాపూర్ లో నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఎస్టీయూ అధ్యక్షులు సౌధాని భూమన యాదవ్, ప్రధాన కార్యదర్శి జి. లక్ష్మణ్ కోరారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యల సాధన కోసం ఈ నెల 27వ తేదీన ఖానాపూర్ లో నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఎస్టీయూ అధ్యక్షులు సౌధాని భూమన యాదవ్, ప్రధాన కార్యదర్శి జి. లక్ష్మణ్ కోరారు.
పోరాట ఆవశ్యకత
పోరాడితే పోయేదేమీ లేదని, సమస్యల సాధన తప్పదని వారు అన్నారు. నేనొక్కడినే వెళ్లకపోతే ఏమవుతుంది అనే భావనతో ప్రతి ఒక్కరూ ధర్నా శిబిరానికి దూరంగా ఉంటే, మన సమస్యల తీవ్రత ప్రభుత్వానికి తెలియదని వారు అభిప్రాయపడ్డారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి ఈ పవిత్రమైన ఉద్యమ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
వాతావరణ హెచ్చరికలు
వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో, ప్రతి ఒక్కరూ తమ గొడుగును వెంట తీసుకొని రావాలని సూచించారు. ఎన్ని ఉరుములు మెరుపులు వచ్చినా, పిడుగులు పడినా, వర్షాలతో వరదలు పోటెత్తినామన గమనం మాత్రం దీక్షా శిబిరం వైపే ఉండాలని పిలుపునిచ్చారు.
ముఖ్య అతిథిగా జుట్టు గజేందర్
ఈ మహాధర్నా కార్యక్రమంలో మన ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గౌరవనీయులు జుట్టు గజేందర్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఆయనతో పాటు గౌరవ రాష్ట్ర బాధ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు తమ తమ మండలాల నుండి అధిక సంఖ్యలో ఎస్టీయూ సభ్యులు పాల్గొనేలా చరవాణి ద్వారా సంప్రదించి, వారిని దీక్షా శిబిరానికి తీసుకురావాలని సూచించారు.
ఐక్యతతో హక్కుల సాధన
మన ఎస్టీయూ సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైందని, మన ఐక్యతను చాటుదాం మన హక్కులను సాధించుకుందాం అని వారు పిలుపునిచ్చారు.












