ఖానాపూర్, 2026-08-05
ఖానాపూర్ మున్సిపల్ 5వ వార్డులో కౌన్సిలర్ మేస పోసమ్మ, నాయకులు సతీష్ ఆధ్వర్యంలో చేపట్టిన పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
ఖానాపూర్ మున్సిపల్ 5వ వార్డులో కౌన్సిలర్ మేస పోసమ్మ, నాయకులు సతీష్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వార్డులోని ఇంద్రనగర్ నుండి కరీంకాలని వెళ్లే ప్రధాన రహదారికి తాత్కాలిక మరమ్మత్తులు చేయించారు. కాలనీలలో దోమల నివారణ కోసం స్ప్రే పిచికారీ చేయిస్తున్నారు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా నిరంతరంగా వార్డులో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇంటి పరిసరాలలో మురికినీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రతి ఒక్కరికీ సూచించడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












