కుంటాల, 2026-08-24
శ్రావణ సోమవారం సందర్భంగా కుంటాల నియోజకవర్గ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పలు శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుంక్లి, సూర్యాపూర్, ఓలా గ్రామాల్లోని ఆలయాల్లో ఆయన పాల్గొన్నారు.
శ్రావణ సోమవారం పురస్కరించుకుని కుంటాల నియోజకవర్గ పరిధిలోని పలు శివాలయాల్లో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బైంసా మండలంలోని సుంక్లి గ్రామంలోని నాగదేవత ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం సూర్యాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన స్వాగత తోరణాన్ని ప్రారంభించి, శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఓలా గ్రామంలోని శివాలయంలో కూడా ఎమ్మెల్యే ప్రత్యేక అలంకరణలు, పూజల్లో పాల్గొన్నారు.
ప్రజల సంక్షేమం కోసం ప్రార్థన
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మాట్లాడుతూ, ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పరమేశ్వరున్ని ప్రార్థించినట్లు తెలిపారు. తన నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఘన స్వాగతం పలికిన ప్రజలు
ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల బిజెపి నాయకులు కలిసి ఎమ్మెల్యేకు శాలువాతో సన్మానించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.











