రేపు (ఈనెల 24న) రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో "వరుణ యాగం"
👉 శివాలయంలో సహస్ర ఘటాభిషేకం..
మిర్యాలగూడ ఆగస్టు 23 (మనోరంజని తెలుగు టైమ్స్)
మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 24 శ్రావణమాసం రెండవ సోమవారం ఉదయం 9:00 గంటలకు మిర్యాల పట్టణంలోని మెయిన్ బజార్ లో గల శ్రీ భ్రమరాంబదేవి సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయం (శివాలయం)లో సహస్ర ఘటాభిషేకం (వరుణ యాగం)నిర్వహిస్తున్నామని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గోళ్ళ రామశేఖర్, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ చౌదరి (బాబి) కార్యదర్శి పోలిశెట్టి ధనుంజయ కోశాధికారి గందె రాము లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం రాష్ట్రమంతా వర్షాలు లేక కుంటలు, చెరువులు ఎండిపోతున్నాయని, వర్షాలు నీరు లేక పంట పొలాలు సైతం నీళ్లు దొరకక కరువు పరిస్థితిలో ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురువాలని, పంటలు పుష్కలంగా పండాలని, త్రాగు,సాగు నీరు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు "వరుణ యాగం" రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల 24 (సోమవారం) ఉదయం 9-00 గంటల నుండి వేదపండితులచే విరాఠ పర్వం, వరుణ హోమం, రుద్ర హోమం, మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, సహస్ర ఘటాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. మిర్యాలగూడ పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలు వరుణ యాగం పూజా కార్యక్రమంలో పాల్గొనాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ బండారు కుశలయ్య మాట్లాడుతూ వరుణ యాగం కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.












