పెబ్బేరు (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 10
కల్వరాల గ్రామానికి చెందిన సర్దార్ మియా ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారని తెలిసి, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, మాజీ ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం పెబ్బేరు పట్టణంలోని ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు.

ఆరోగ్య పరిస్థితిపై ఆరా
ఈ సందర్భంగా సర్దార్ మియా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న నిరంజన్ రెడ్డి, మెరుగైన వైద్య సేవలు తీసుకోవాలని సూచించారు. త్వరగా పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆయనకు ధైర్యం చెప్పారు.
స్థానిక నాయకుల హాజరు
ఈ కార్యక్రమంలో స్థానిక భారత రాష్ట్ర సమితి నాయకులు, మాజీ మున్సిపల్ ఉపాధ్యక్షుడు కర్రెస్వామి, విశ్వరూపం, రాజశేఖర్, సాయినాథ్, ఎల్లారెడ్డి, వడ్డె రమేష్, సాయిరెడ్డి, సంబురాము, వేణు, మూర్తి, అఖిల్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.