సాంగ్వి (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 07
అదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సాంగ్వి అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శిశువుల ఆరోగ్య పరిరక్షణలో తల్లిపాల ప్రాముఖ్యత, వాటి కీలక పాత్రపై అవగాహన కార్యక్రమం చేపట్టారు.

తల్లులకు అవగాహన
పుట్టిన వెంటనే శిశువుకు, ఆరు నెలలపాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాల్సిన ఆవశ్యకతను తల్లులకు వివరించారు. గ్రామంలోని ప్రజలకు కూడా దీనిపై అవగాహన కల్పించారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొమరం లలిత, ఉప సర్పంచ్ బనియ సుందర్, పాఠశాల ఉపాధ్యాయుడు తెలంగారవు, పంచాయతీ కార్యదర్శి సీతారాం, ఏఎన్ఎం చంద్రకళ, అంగన్వాడీ టీచర్లు సి.సుందీబాయి, ఆయమ్మ, గ్రామ పంచాయతీ పరిధిలోని గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.