Nirmal/Khanapur (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 12
ఖానాపూర్ పట్టణంలో ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలని, అందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ పిలుపునిచ్చారు. పట్టణ పురపాలక సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ప్లాస్టిక్ నిషేధం ర్యాలీలో ఆమె పాల్గొన్నారు.
ప్లాస్టిక్ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ అన్నారు. ఖానాపూర్ పట్టణంలోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ప్లాస్టిక్ నిషేధం ర్యాలీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలు ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వస్తువులను వాడటం మానేసి, వాటి స్థానంలో పేపర్ బ్యాగులు, భూమిలో కలిసిపోయే వస్తువులను వాడాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణంలో కాలుష్యం ఏర్పడి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.
అందరూ కలిసికట్టుగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి, ప్లాస్టిక్ రహిత, శుభ్రమైన ఖానాపూర్ ను నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు సురేందర్, రామకృష్ణ, శ్రీనివాస్, శ్యామల, వర్ష, అబికా, పోశెట్టి, మానాల శంకర్, గణపతి రెడ్డి, దిరాజ్, చేతన్, మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












