లోకేశ్వరం, 2023-08-31
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామ శివారులో గల పెద్ద చెరువు శిఖం భూమిని కొందరు గంగపుత్ర సంఘ సభ్యులు కబ్జా చేసి సాగు చేసుకుంటున్నారని ఆరోపిస్తూ, పిప్రి గ్రామస్తులు సోమవారం మండల ప్రజావాణిలో ఎంపీడీవో రామకృష్ణకు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా పిప్రి గ్రామస్తులు మాట్లాడుతూ.. పిప్రి పెద్ద చెరువుకు సంబంధించిన సుమారు నాలుగు ఎకరాల శిఖం భూమిని గ్రామంలోని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో అక్రమంగా వేలంపాట నిర్వహించి కొన్నేళ్లుగా పంట సాగు చేసుకుంటున్నారని ఆరోపించారు.
అదేవిధంగా, ఎమర్జెన్సీ వర్క్స్ ప్రొసీడింగ్ పేరిట ఇటీవల రెండు నూతన తూములను నిర్మించారని, వాటిని ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసేందుకు అందులో ఇష్టారీతిన ఇసుక బస్తాలను వేస్తూ గంగపుత్ర సంఘ సభ్యులు అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో జాయింట్ సర్వే చేపట్టి శిఖం భూముల ఆక్రమణకు అడ్డుకట్ట వేయాలని కోరారు.
చెరువు శిఖం భూమిని అక్రమంగా కబ్జా చేసి సాగు చేసుకుంటూ, ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన తూములను ధ్వంసం చేయడానికి పాల్పడిన గంగపుత్ర సంఘ సభ్యులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులకు విజ్ఞప్తి చేశారు.