కీసర, 2026-08-31
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దమ్మాయిగూడ డివిజన్04, శ్రీ రామలింగేశ్వర కాలనీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని సీపీఎం కీసర మండల కమిటీ కోరింది. ఈ మేరకు సోమవారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన ఈ కాలనీలో సరైన డ్రైనేజీ, రహదారుల సౌకర్యాలు లేక స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం కీసర మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు తెలిపారు. కాలనీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థతో పాటు నాణ్యమైన రోడ్లను నిర్మించి మౌలిక వసతులు కల్పించాలని వారు కోరారు.
కార్యక్రమంలో సీపీఎం కీసర మండల నాయకులు శివన్నారాయణ, కలువల శ్రీనివాస్, నితిన్, కలమ్మ, తార, పోచమ్మ, రాములు తదితరులు పాల్గొన్నారు.