అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇళ్ల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలిపారు. భైంసా మండలం మాంజ్రీ గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.
భైంసా మండలం మాంజ్రీ గ్రామంలో కవుడేకర్ మానజీ ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. గత పాలకుల హయాంలో పదేళ్లపాటు ఇళ్ల నిర్మాణం చేపట్టకపోవడం వల్ల పేదలు ఇబ్బందులు పడ్డారని ఆయన పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇళ్లు మంజూరు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాల ద్వారా పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారిలో సీనియర్ నాయకులు సొలంకి భీమ్రావ్, మాజీ ఎం.పి.పి. రజాక్, భైంసా మండల బిజెపి అధ్యక్షురాలు దేగాం సర్పంచ్ సిరం సుష్మరెడ్డి, స్థానిక సర్పంచ్ మారుతి, సర్పంచులు సిరం రాజమణి శ్రీనివాస్, సుధాకర్, అశోక్, బెల్ తరోడా సర్పంచ్ సాయినాథ్, మాజీ ఎం.పి.టి.సి. అశోక్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు భూమేష్, మాజీ సర్పంచ్ హన్మాండ్లు ఉన్నారు.












