నిజామాబాద్, 2026-06-05
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా నిజామాబాద్లో ఆయన విగ్రహానికి భారతీయ జనతా పార్టీ నాయకులు, తెలంగాణ , , , మైనారిటీ సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు, సాధికారత సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుస్సాపూర్ శంకర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా బుస్సాపూర్ శంకర్ మాట్లాడుతూ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి, సామాజిక న్యాయానికి, సమానత్వానికి ప్రతీకగా నిలిచిన మహావీరుడని కొనియాడారు. సామాన్య ప్రజల నుంచి ఎదిగి, తన ధైర్యసాహసాలతో ప్రజల కోసం పోరాడిన పాపన్న గౌడ్ జీవితం తెలంగాణ సమాజానికి చిరస్మరణీయమని అన్నారు.
సామాజిక వివక్షకు వ్యతిరేకంగా నిలిచి, బహుజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం పాపన్న గౌడ్ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం, సమాజంలోని ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పించడం మనందరి బాధ్యత అని బుస్సాపూర్ శంకర్ అన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమంలో బుస్సాపూర్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ సేవలను, ఆయన పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీ మిరియాల సురేష్ బాబు, జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి సునంద, బహుజన నాయకులు, వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.