నిర్మల్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు, నర్సాపూర్ (జి) మండల పరిధిలోని నర్సాపూర్ (జి) గ్రామ సర్పంచ్ గడ్డం ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం మాజీ మంత్రి అల్లోళ్ల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోళ్ల మురళీధర్ రెడ్డిలను వారి నివాసాల్లో వేర్వేరుగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పూల బొకేలు అందజేశారు.
సన్మానం
అనంతరం మాజీ మంత్రి అల్లోళ్ల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోళ్ల మురళీధర్ రెడ్డిలు వేర్వేరుగా గడ్డం ఇంద్రకరణ్ రెడ్డిని శాలువాలతో సత్కరించారు.
చర్చించిన అంశాలు
జిల్లా సర్పంచుల సమస్యలు, గ్రామాల అభివృద్ధి తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిపారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఉమామహేశ్వర్, వివిధ గ్రామాల సర్పంచులు సతీష్ రెడ్డి, శ్రీనివాస్, నాయకులు రాథోడ్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.












