నిర్మల్, 2026-07-20
నిర్మల్ ఎంపీడీవోగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సలేంద్ర సుధాకర్ ను ముదిరాజ్ సంఘం నాయకులు, సర్పంచ్, ఉప సర్పంచ్ లు జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వారికి శాలువాతో సన్మానం చేసి, పూల బుక్కెను అందజేసి, మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎంపీడీవో సలేంద్ర సుధాకర్ మరిన్ని ఉన్నత పదోన్నతులు పొందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాతర్ల హరీష్ ముదిరాజ్, జిల్లా గౌరవ అధ్యక్షులు బర్మా చిన్నయ్య ముదిరాజ్, సుంకరి రాజేష్ ముదిరాజ్, అడ్వకేట్ గొడుగు గంగాధర్ ముదిరాజ్, నిలాయిపేట్ సర్పంచ్ గొట్టం సుమలత భీమేష్, ఎల్లపల్లి గ్రామ ఉపసర్పంచ్ రామన్ కిషన్ ముదిరాజ్, అనంత పేట్ ఉప సర్పంచ్ నలిమెల రాములు ముదిరాజు, వెంగవాపేట్ గ్రామ ఉపసర్పంచ్ రాజేశ్వర్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.