Palnadu/Gurazala (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 20
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామంలో సుమారు రూ.300 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సమీకృత పామ్ ఆయిల్ పరిశ్రమను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ప్రారంభించారు. ఈ పరిశ్రమతో రైతులకు అధిక దిగుబడి, మెరుగైన ఆదాయం లభిస్తుందని తెలిపారు.
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామంలో సుమారు రూ.300 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సమీకృత పామ్ ఆయిల్ పరిశ్రమను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఖమ్మం వంటి వ్యవసాయ ఆధారిత జిల్లాల్లో రైతులకు అధిక దిగుబడి, మెరుగైన ఆదాయాన్ని అందించే పంటగా ఆయిల్ పామ్‌కు విస్తృత అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల్లోనూ రైతుకు స్థిరమైన ఆదాయాన్ని అందించే వాణిజ్య పంటగా ఆయిల్ పామ్ నిలుస్తుందని పేర్కొన్నారు.
ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.45 వేల వరకు సబ్సిడీ అందిస్తోందని తెలిపారు. దేశంలో పెరుగుతున్న పామ్ ఆయిల్ అవసరాలను స్వదేశీ ఉత్పత్తితో తీర్చడం ద్వారా రైతులకు లాభంతో పాటు విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని చెప్పారు.
ప్రస్తుతం మలేషియా, ఇండోనేషియా దేశాల నుంచి దిగుమతి అవుతున్న పామ్ ఆయిల్ విత్తనాలను భవిష్యత్తులో కొణిజర్ల నుంచే దేశానికి అందించే స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని వెల్లడించారు. 113 ఎకరాల విస్తీర్ణంలో విత్తన జన్యు కేంద్రం, విత్తన తోట, నర్సరీ, పరిశోధన, పామ్ మిల్లింగ్, శుద్ధి కేంద్రం వంటి సమగ్ర సౌకర్యాలు ఏర్పాటు కావడం ద్వారా ఈ ప్రాంతం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రైతు కేవలం పంటలు పండించడానికే పరిమితం కాకుండా విలువ ఆధారిత ఉత్పత్తులు, వాణిజ్య వ్యవసాయం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని, అప్పుడే "రైతే రాజు" అనే భావన సాకారమవుతుందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా సహా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రైతాంగానికి అండగా నిలుస్తోందని తెలిపారు.












