ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు నిర్వహించనున్న జాబ్ మేళాకు సంబంధించిన గోడప్రతులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 6వ తేదీన ఆదిలాబాద్లో నిర్వహించనున్న జాబ్ మేళాలో అర్హులైన నిరుద్యోగ యువత పాల్గొనాలని సూచించారు. పోస్టర్లో ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా తమ పేరును నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ నరసింహారెడ్డి, యువజన క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఉపాధి కల్పన అధికారి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.












