వెంగళరావు నగర్లోని నలంద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించి, విద్యా రంగంలో మరోసారి తమ సత్తా చాటుకుంది. అమర్ మండల్ 581 మార్కులతో టాపర్గా నిలిచారు.
45 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన నలంద విద్యాసంస్థలు, 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించి, విద్యార్థుల అద్భుత ప్రతిభకు అద్దం పట్టాయి.
ఈ విద్యా సంవత్సరంలో అమర్ మండల్ 581 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, 35% మంది విద్యార్థులు 90% పైగా మార్కులు సాధించారు. మొత్తం విద్యార్థులలో 60% మంది 500 మార్కుల కంటే ఎక్కువ సాధించడం విశేషం. ఈ ఫలితాలు విద్యార్థుల కృషికి, సంస్థ బోధనా పద్ధతులకు నిదర్శనంగా నిలిచాయి.
సంస్థ యాజమాన్యం ఈ విజయం వెనుక ఉన్న ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషిని అభినందించింది. విద్యార్థుల కఠోర శ్రమ, స్మార్ట్ వర్క్ విధానాలే ఈ అద్భుత ఫలితాలకు కారణమని పేర్కొంది. విద్యార్థుల్లో క్రమశిక్షణ, విలువలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే తమ ప్రధాన లక్ష్యమని సంస్థ చైర్మన్ మంతెన శ్రీనివాస రాజా తెలిపారు.
సంస్థ డైరెక్టర్ మంతెన సూర్య మాట్లాడుతూ, విద్యార్థులకు సబ్జెక్ట్ జ్ఞానంతో పాటు, స్మార్ట్ లెర్నింగ్ టెక్నిక్స్, సమస్య పరిష్కార నైపుణ్యాలను అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులను దేశానికి ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దడంలో తమ వంతు కృషి కొనసాగిస్తామని సంస్థ వెల్లడించింది.












