బాసర పోలీస్ స్టేషన్ పరిధిలో విధి నిర్వహణలో ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హోం గార్డు వెంకట రమణ కుటుంబానికి జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, ఐపీఎస్, రూ.30 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
నిర్మల్ జిల్లా బాసర పోలీస్ స్టేషన్ లో హోం గార్డుగా పనిచేస్తున్న వెంకట రమణ, ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మరణించారు.
ఈ నేపథ్యంలో, యాక్సిడెంటల్ బెనిఫిట్ స్కీమ్ కింద మంజూరైన రూ.30 లక్షల చెక్కును జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, ఐపీఎస్, మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు శాఖ తమ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని, ఈ ఆర్థిక సహాయం మృతుడి కుటుంబానికి కొంత ఊరటనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం మరియు పోలీసు శాఖ ఎల్లప్పుడూ సిబ్బంది సంక్షేమం పట్ల కట్టుబడి ఉంటాయని ఆమె తెలిపారు.








