కడం (పెద్దూర్), జూలై 28
నిజిషభనెకొది.జూననచిజూై28కనదైనషపసధణకే30.%కకగఉది.జిని9షపననిఎదకొననయి.దైఆదళనచెదనన.
నిర్మల్ జిల్లాలో తీవ్ర వర్షాభావం నెలకొంది. జూన్ 1 నుంచి జూలై 28 వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 452.3 మి.మీ. ఉండగా, కేవలం 313.4 మి.మీ. మాత్రమే నమోదైంది. ఇది సాధారణం కంటే 30.7% లోటు. జిల్లాలోని 19 మండలాల్లో 17 మండలాలు లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటున్నాయి.
బాసర మండలంలో అత్యధికంగా 45% వర్షం లోటు నమోదైంది. పెంబి, కడం, పెద్దుర్ మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం కురిసింది. కురవాల్సిన వర్షం కంటే తక్కువ నమోదవుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయని వారు తెలిపారు.












