నిర్మల్, జులై 30
నిర్మల్ జిల్లాలో ఓటరు నమోదు ప్రక్రియ 100 శాతం పూర్తయినట్లు పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్చార్జ్ ఆరేపల్లి మోహన్, నిర్మల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ తహర్ బిన్ హమ్దాన్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం మారుతి ఇన్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో బీఎల్ఏ లను వారు అభినందించారు.
ఓటరు నమోదు ప్రక్రియపై నిర్మల్ నియోజకవర్గ బీఎల్ఏ పరిశీలకులతో గురువారం మారుతి ఇన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్చార్జ్ ఆరేపల్లి మోహన్, నిర్మల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ తహర్ బిన్ హమ్దాన్, నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీహరి రావు పాల్గొన్నారు.
జిల్లాలో 100 శాతం సర్ ప్రక్రియ పూర్తి కావడానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏ లను నాయకులు ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం ఆరేపల్లి మోహన్, తహర్ బిన్ హందాన్ మాట్లాడుతూ, నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు 100 శాతం సర్ ప్రక్రియ పూర్తయిందని, దీనికి గాను అహర్నిశలు శ్రమించిన కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏ లను అభినందించారు.
ఈ ప్రక్రియలో ఏమైనా తప్పులు దొర్లి ఉంటే మరో రెండు రోజుల సమయం ఉందని, జరిగిన తప్పులను సవరించుకుందామని నాయకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, నిర్మల్ సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు సోమ భీమ్ రెడ్డి, అబ్దుల్ హాది, వివిధ మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ బీఎల్ఏ పరిశీలకులు, తదితరులు పాల్గొన్నారు.












