చిత్తూరు, 26 July
నగరి జాతీయ కాపు సంఘం అధ్యక్షుడు ఎంవి బాబు అనుచరులు, నగరి మండపం వద్ద ఉన్న చిల్డ్రన్స్ ఫర్ హోమ్ అనాధాశ్రమంలోని పిల్లలకు నూతన బట్టలు పంపిణీ చేశారు. సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గంలో నిత్యం సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సభ్యులు తెలిపారు.
నగరి జాతీయ కాపు సంఘం అధ్యక్షుడు ఎంవి బాబు అనుచరులు, నగరి మండపం వద్ద ఉన్న చిల్డ్రన్స్ ఫర్ హోమ్ అనాధాశ్రమంలోని పిల్లలకు నూతన బట్టలు పంపిణీ చేశారు. జాతీయ కాపు సంఘం ఎం వి బాబు ఆధ్వర్యంలో, వారి అనుచరుల సహకారంతో నియోజకవర్గంలో ప్రతిరోజూ, ప్రతివారం, ప్రతి నెలా ఏదో ఒక సామాజిక కార్యక్రమాన్ని నిర్వహించడం సామాజిక వర్గానికి గర్వకారణమని జాతీయ కాపు సంఘం సభ్యులు ఒకరైన ఎన్సి శేఖర్ ఎంవి బాబును కొనియాడారు.
గత వారం ఎంవి బాబు అనుచరుల్లో ఒకరైన గాలి అయ్యప్ప రాయల్, తిరుపతి-చెన్నై రహదారిలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న నాగాలమ్మ ఆలయానికి సూలం సమర్పించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు, అనాధాశ్రమాల్లోని పిల్లలకు పుస్తకాలు, బియ్యం వంటి సహాయ కార్యక్రమాలను అందించడంలో ఎప్పుడూ ముందుంటారని కాపు సామాజిక వర్గ సభ్యుడు మణికంఠ తెలిపారు.
ఈ నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో గాలి అయ్యప్ప రాయల్, గాలి గాంధీ రాయల్, గాలి రాధాకృష్ణ రాయల్, వేలు రాయల్, మనీ రాయల్ పాల్గొన్నారు.











