నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో ఇటీవల మరణించిన పలు కుటుంబాలను బి.ఆర్.ఎస్ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్రావు సోమవారం పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మండల కేంద్రానికి చెందిన కోట్టూరు పెంటయ్య (పూర్వపు న్యూ స్టైలో టైలర్ యజమాని) అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులను, కుమారులైన కే. నర్సయ్య, కే. విశ్వనాథ్, కే. తిరుపతిని కలిసి ఓదార్చి, సంతాపం తెలిపారు.
తాటికాయల దేవన్న మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. దాబా గంగాధర్ మృతి చెందడంతో ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఇదే సందర్భంగా నందిపేటకు చెందిన పూర్వపు సూర్యోదయ కాన్వెంట్ స్కూల్ యజమాని కొట్టపెల్లి యార్లగడ్డ కోటేశ్వర్రావు ఇటీవల ఆస్ట్రేలియాలో మృతి చెందగా, ఆయన కుమారుడు యార్లగడ్డ వంశీకి చరవాణి ద్వారా ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంగళవారం నిర్వహించిన దహన సంస్కార కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ పరామర్శలో సిలెండర్ లింగం (సర్పంచ్, నందిపేట), ఏ.రామారావు (మాజీ సర్పంచ్, ఆంధ్ర నగర్), మాజీ ఉప సర్పంచ్ భరత్, ఎస్. జోహార్ బాబు (పెట్రోల్ బంక్, నందిపేట), కే. గంగాధర్ (సీపీఐ ఏం. ఎల్ ప్రజా పంత రాష్ట్ర నాయకులు, నందిపేట)తో పాటు పలువురు పాల్గొన్నారు.












