ముధోల్, 2026-06-05
ముధోల్ మండల కేంద్రంలోని విట్టోలి తాండ గ్రామంలో గత 20 ఏళ్లుగా నివసిస్తున్న గోమాత అనారోగ్యంతో మృతి చెందింది. గ్రామస్తులు ఈ గోమాతకు బంజారా సంప్రదాయాల ప్రకారం ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.
ముధోల్ మండల కేంద్రంలోని విట్టోలి తాండ గ్రామంలో గత 20 ఏళ్లుగా నివసిస్తున్న గోమాత అనారోగ్యంతో మృతి చెందింది. గ్రామ యువకులు, గ్రామస్తులు ఈ గోమాతకు పూజలు, భజన కీర్తనలు, హారతులు, టపాకాయలతో నివాళులర్పించారు.
బంజారా సంప్రదాయాలతో అంతిమయాత్ర
సేవాలాల్ మహారాజ్ పేరుతో 3095 గోవులను వ్యాపారం చేసుకుంటూ అనంతపురం జిల్లా నుంచి వలస వస్తున్న సమయంలో, మొఘల్ చక్రవర్తుల కాలం నాటి చరిత్రను గుర్తు చేసుకుంటూ విట్టోలి తాండ గ్రామ ప్రజలు బంజారా సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం అంతిమయాత్ర నిర్వహించారు. ఆడపడుచులు, మహిళలు, డప్పులు వాయిస్తున్న యువకులు, గ్రామస్తులు అందరూ కలిసి రామారావు మహారాజ్ విగ్రహం వెనుక సమాధి వద్ద అంత్యక్రియలు జరిపారు.












