విల్లుపురం (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 15
తమిళనాడులోని విల్లుపురం జిల్లా విలుండమావడి గ్రామంలో మత్స్యకార సంఘం పెద్దలు మద్యపాన నియంత్రణకు వినూత్న నిర్ణయాలు తీసుకున్నారు. పెళ్లికాని యువకులు మద్యం సేవిస్తూ పట్టుబడితే భారీ జరిమానాతో పాటు, సమాచారం అందించిన వారికి నగదు బహుమతి ప్రకటించారు.
తమిళనాడులోని విల్లుపురం జిల్లా విలుండమావడి గ్రామంలో మద్యపాన నియంత్రణకు మత్స్యకార సంఘం పెద్దలు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. పెళ్లికాని యువకులు మద్యం సేవిస్తూ పట్టుబడితే రూ.5,000 జరిమానా విధించాలని, మద్యం సేవిస్తున్న యువకుల గురించి సమాచారం అందించిన వారికి రూ.2,000 నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు.
సంఘం లక్ష్యాలు
యువత మద్యానికి దూరంగా ఉండేలా చేయడంతో పాటు వారి భవిష్యత్తును కాపాడటం, గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించడమే తమ లక్ష్యమని సంఘం పెద్దలు తెలిపారు.
పెళ్లైన వారికి షరతులు
అయితే, పెళ్లైన పురుషులు మద్యం సేవించడంపై నిషేధం లేదు. కానీ, వారు మద్యం సేవించి గొడవలకు పాల్పడితే మాత్రం రూ.5,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.












