కుభీర్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 26
కుభీర్ మండలంలోని సిరిపెల్లి తండా-3, పార్డి-కే, హంపోలి గ్రామాలతో పాటు భోకర్ తాలూకాలోని కీని గ్రామంలో ఇటీవల మరణించిన వారి కుటుంబాలను ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
కుభీర్ మండలంలోని సిరిపెల్లి తండా-3, పార్డి-కే, హంపోలి గ్రామాలతో పాటు భోకర్ తాలూకాలోని కీని గ్రామంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పరామర్శించారు.
కీని గ్రామానికి చెందిన డాక్టర్ ముత్యం రెడ్డి తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఇతర బాధిత కుటుంబాలను సైతం పరామర్శించి, మృతి చెందిన వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.












