తానూర్, జులై 26
తానుర్ మండలం బోల్సా గ్రామ పంచాయతీ పరిధిలోని బోల్సా గ్రామం, అనుబంధ గ్రామాల్లో నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను గ్రామ సర్పంచ్ సీహెచ్. సుదర్శన్ యాదవ్ గురువారం ప్రారంభించారు. ఈ ట్రాన్స్ఫార్మర్ ద్వారా నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు లో-వోల్టేజ్ సమస్యలు పరిష్కారం కానున్నాయి.
తానుర్ మండలం పరిధిలోని బోల్సా గ్రామ పంచాయతీ, బోల్సా గ్రామం, అనుబంధ గ్రామాల్లో నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను గ్రామ సర్పంచ్ సీహెచ్. సుదర్శన్ యాదవ్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సుదర్శన్ యాదవ్ మాట్లాడుతూ, గ్రామంలో నిరంతర విద్యుత్ సరఫరా అందించడంతో పాటు లో-వోల్టేజ్ సమస్యలను నివారించేందుకు ఈ నూతన ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో రైతులు, విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ లైన్మెన్, ఇతర అధికారులు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












