ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఆశీస్సులతో నియోజకవర్గానికి గత రెండేళ్లలో కోట్లాది రూపాయల నిధులు మంజూరు అయ్యాయని, గత పదేళ్లలో అభివృద్ధి కుంటుపడిందని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలిపారు.
శనివారం బైంసాలో నిర్వహించిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి శాఖల ద్వారా రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
సెంట్రల్ రిజర్వ్ ఫండ్ కింద డబుల్ లైన్ రోడ్లు, బాసర ఆలయ అభివృద్ధి, పాఠశాలల నిర్మాణం, భైంసాలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించినట్లు వివరించారు.
సిరాల ప్రాజెక్ట్, లిఫ్ట్ ఇరిగేషన్ కు నిధులు మంజూరు చేయించుకున్నామని, గతంతో పోలిస్తే అదనంగా 15 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని పేర్కొన్నారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, గంజాయి నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, ట్రాఫిక్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం మహిళా సంఘాలకు రుణాలను పంపిణీ చేశారు.












