మిర్యాలగూడ, 2026-08-14
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయిల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయిలో కూడా ఏర్పాటు చేసి, పౌరులకు ఫిర్యాదుల పరిష్కారాన్ని మరింత సులభతరం చేసిందని మిర్యాలగూడ ఎంపీడిఓ ఎం. శేషగిరిశర్మ తెలిపారు. మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి ఒంటిగంట వరకు నిర్వహించబడుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ నెల 17 నుండి ప్రారంభం
ఈ ప్రజావాణి కార్యక్రమం మిర్యాలగూడ మండలంలో ఈ నెల 17వ తేదీ సోమవారం నుండి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఎంపీడిఓ శేషగిరిశర్మ తెలిపారు. ఈ ప్రజావాణికి ఎంపీడీఓ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు.
అధికారుల హాజరు
ఈ ప్రజావాణి కార్యక్రమానికి తహసిల్దార్, ఎంపీఓ, మండల వ్యవసాయ అధికారి, హార్టికల్చర్ అధికారి, వెటర్నరీ సర్జన్, ఫిషరీస్ డెవలప్మెంట్ అధికారి లేదా ఫిషరీస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, మండల విద్యాధికారి, మండల వైద్యాధికారి, ఐసిడిఎస్ పిఓ, అంగన్వాడి సూపర్వైజర్లు, మండల సాంఘిక సంక్షేమ అధికారులు, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి, బీసీ వెల్ఫేర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్, డిప్యూటీ తహసిల్దార్ సివిల్ సప్లైస్, అసిస్టెంట్ ఇంజనీర్ హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, అసిస్టెంట్ డైరెక్టర్ గ్రౌండ్ వాటర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లేదా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ వంటి వివిధ మండల స్థాయి అధికారులు హాజరై ప్రజల ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు ప్రారంభిస్తారని తెలిపారు.
ప్రజలకు విజ్ఞప్తి
మండలంలోని ప్రజలంతా ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడిఓ శేషగిరిశర్మ కోరారు.