మామడ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 14
మామడ మండల కేందం నుండ కొటకల గామానక వెళలే బీటీ ోడడును వెడలు చేసే నులలో భాగంగా సవే నవహంచాు. కేంద భువ హామోడ థకం కంద ఈ ోడడు నమాణం చేటటాు.
మామడ మండల కేంద్రం నుండి కొరటికల్ గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డును వెడల్పు చేసే పనుల్లో భాగంగా సర్వే నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ హామ్రోడ్ పథకం కింద ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి మండల కేంద్రం నుండి గ్రామాలకు నాణ్యమైన రోడ్లను నిర్మిస్తున్నారని, భవిష్యత్తులోనూ ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు సౌకర్యం కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఎమ్మెల్యే సహకారంతో నిధుల మంజూరు
నిర్మల్ నియోజకవర్గంలో తమ గ్రామానికి చెందిన రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సహకారంతో నిధులు మంజూరు అయ్యాయని గ్రామస్తులు తెలిపారు. ఈ రోడ్డు వెడల్పు పనుల కోసం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఏఈ సంజయ్ నేతృత్వంలో సర్వే చేపట్టారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో మామడ సర్పంచ్ మోతే రాజేశ్వర్, ఉప సర్పంచ్ పాటుకురి మహిపాల్ రెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ సంజయ్ తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.












