దివంగత ఉద్యోగి డి. ప్రతాప్ కుమార్తె డాలీ స్వీటీకి మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీలో అగ్రికల్చరల్ మార్కెట్ సూపర్వైజర్ గా కారుణ్య నియామకం లభించింది. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆమెకు నియామక ఉత్తర్వులను అందజేశారు.
మిర్యాలగూడకు చెందిన దివంగత డి. ప్రతాప్ కుమార్తె డాలీ స్వీటీకి కారుణ్య నియామకం కింద వ్యవసాయ మార్కెట్ కమిటీ మిర్యాలగూడలో అగ్రికల్చరల్ మార్కెట్ సూపర్వైజర్ గా ఉద్యోగం లభించింది. ఆమెకు సంబంధించిన నియామక ఉత్తర్వులను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గురువారం అందజేశారు.
ఉద్యోగి మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకూడదనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఈ నియామకం అతి తక్కువ సమయంలోనే పూర్తయింది. ఈ ప్రక్రియలో చొరవ తీసుకుని సహకరించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ సురేంద్రమోహన్, డైరెక్టర్ లక్ష్మీ భాయ్, అదనపు డైరెక్టర్ లక్ష్మణుడు లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కారుణ్య నియామక ఉత్తర్వుల జారీకి కృషి చేసిన తెలంగాణ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సెంట్రల్ ఫోరం, హైదరాబాద్ అధ్యక్షులు చిలక నర్సింహ్మ రెడ్డికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసి ఉద్యోగుల సంఘం కార్యదర్శి ముక్రం, నల్గొండ జిల్లా యూనిట్ అధ్యక్షులు మధు బాబు, కార్యదర్శి ఉమామహేశ్, సిబ్బంది సంఘ ప్రతినిధులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు మేడ మహేందర్ రెడ్డి హాజరై డాలీ స్వీటీకి శుభాకాంక్షలు తెలిపారు.








