ఖానాపూర్, 2026-08-18
ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులలో సామాజిక అంశాలపై అవగాహన పెంచే లక్ష్యంతో సోషల్ ప్రాజెక్టుల మేళాను మంగళవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు అత్యంత ఉత్సాహంతో పాల్గొని వివిధ సామాజిక అంశాలపై సృజనాత్మక ప్రాజెక్టులను ప్రదర్శించారు.

ఆకట్టుకున్న ప్రాజెక్టులు
విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులలో విక్రమ్ రాకెట్ మోడల్, భూమి అంతర్గత నిర్మాణం, అటవీ పరిరక్షణ, వాతావరణ విస్తరణ, అక్షంశాలు-రేఖాంశాలు, సౌర కుటుంబం, మహా సముద్ర భూతల స్వరూపం, అగ్ని పర్వత అంతర్నిర్మాణం వంటి అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తాము తయారు చేసిన ప్రాజెక్టుల వివరాలను విద్యార్థులు సందర్శకులకు వివరించారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాడి శ్రీనివాస్, గైడ్ టీచర్లు రాపర్తి కిషన్ ప్రసాద్, వెన్నం అంజయ్యతో పాటు ఇతర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.