తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే.టి. రామారావు (కేటీఆర్) గారి జన్మదినం సందర్భంగా, బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ గారి ఆదేశాల మేరకు, కడం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నల్ల జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కడం మండల కేంద్రంలో కేక్ కట్ చేసి, అనంతరం కడం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కడం మండల మాజీ ఎంపీపీ రాజేశ్వర్ గౌడ్, నిర్మల్ జిల్లా మాజీ జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ ఎండి రఫీక్ అహ్మద్, కడం మండల మాజీ ఎంపీపీ భూక్య అమ్మి బాపూ రావు, ఖానాపూర్ మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కానూరి సతీష్, పార్టీ సీనియర్ నాయకులు ఇస్లావత్ గంగన్న, మాజీ సర్పంచ్ కొప్పుల లచ్చన్న, పార్టీ సీనియర్ నాయకులు నరసయ్య, మామిడి రాజేశ్వర్ గౌడ్, కోల నరేష్, శనిగారపు రాజేశ్వర్, ముబారక్ బీన్ మొహమ్మద్, వేణుగోపాల్ నాయక్, ఎండి హసీబ్, చిట్యాల రవి, జాడి నరసయ్య, కోటయ్య, శంకర్, రంజిత్ కుమార్ బబ్లు, లక్ష్మి నారాయణ, పవన్ నాయక్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












