కోల్కతా (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 19
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక హోటల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో ఒక చిన్నారి కూడా ఉంది. బంగ్లాదేశ్ నుంచి వైద్యం కోసం వచ్చిన వారే ఈ ప్రమాదానికి గురయ్యారు.
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక హోటల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో ఒక చిన్నారి కూడా ఉంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, బంగ్లాదేశ్ నుంచి వైద్యం కోసం వచ్చిన పలువురు కోల్కతాలోని న్యూమార్కెట్ సమీపంలో ఉన్న ఒక హోటల్లో బస చేస్తున్నారు.
ప్రమాద కారణాలు
అంతా నిద్రలో ఉన్న సమయంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్పటికే మంటలు వ్యాపించడంతో వారంతా లోపల చిక్కుకుపోయారు. మరణించిన తొమ్మిది మంది బంగ్లాదేశ్ జాతీయులని అధికారులు వెల్లడించారు. ఏసీలో పేలుడే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో ఆరుగురికి పైగా గాయపడ్డారు.
గతంలోనూ ఇలాంటి ఘటనలు
ఇటీవల పశ్చిమబెంగాల్లోని బీరభూమ్ జిల్లా తారాపీఠ్ వద్ద ఒక హోటల్లో జరిగిన అగ్నిప్రమాదం తెలిసిందే. ఆ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గ్రౌండ్ ఫ్లోర్లోని హోటల్ రిసెప్షన్లో మొదలైన మంటలు క్షణాల్లోనే భవనమంతా వ్యాపించాయి. అప్పుడు అతిథులంతా నిద్రలో ఉండటంతో ప్రాణనష్టం సంభవించింది.












