ఖానాపూర్, 2026-08-21
ఖానాపూర్ పట్టణంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం పూజలను మహిళలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది శ్రావణమాసంలో మొదటి శుక్రవారం ఈ వ్రతాన్ని మహిళలు ఘనంగా నిర్వహించుకుంటారు. ఒకరోజు ముందే పూజకు సంబంధించిన వస్తువులను, సామాగ్రిని సిద్ధం చేసుకుంటారు.
ఖానాపూర్ పట్టణంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం పూజలను మహిళలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది శ్రావణమాసంలో మొదటి శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు ఘనంగా నిర్వహించుకుంటారు. ఒకరోజు ముందే పూజకు సంబంధించిన వస్తువులను, సామాగ్రిని సిద్ధం చేసుకుంటారు.
వ్రత విధానం
ఉదయం అమృత ఘడియలలో మేల్కొని ఇంటిని శుభ్రపరచుకొని, అభ్యంగన స్నానాలు చేసి, పిల్లలు, పెద్దలు అందరూ నూతన వస్త్రాలు ధరించి, భక్తిశ్రద్ధలతో, నియమాలతో వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తారు. కొందరు పూజారులచే వ్రతాన్ని, కథను చెప్పించుకుంటారు.
వాయినాల పంపిణీ
అధిక సంఖ్యలో మహిళలు ఇంటిలోనే పూజలు నిర్వహించుకొని, తరువాత చుట్టుపక్కల వారిని, బంధువులను పిలుచుకొని వాయినాలను ఒకరికొకరు ఇచ్చుకుంటారు. ఖానాపూర్ పట్టణంలోని పద్మశాలి సంఘం అధ్యక్షులు విద్యానగర్ 2కు చెందిన ఎనగందుల నారాయణ ఇంటిలో మహిళలు రుక్మిణి, అలేఖ్య తదితరులు వాయినాలను ఒకరికి ఒకరు తీసుకున్నారు.
గ్రామాల్లోనూ వేడుకలు
మండలంలోని పలు గ్రామాల్లోనూ వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు ఘనంగా నిర్వహించారు.












