ఖానాపూర్, 2026-07-24
ఖానాపూర్ పట్టణంలో వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నివారణకు మున్సిపాలిటీ చర్యలు చేపట్టింది. ప్రజలు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి అనారోగ్య సమస్యలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తగా వార్డులలో దోమల ఫాగింగ్ స్ప్రే పిచికారీ చేయిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ ప్రారంభించారు.
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఖానాపూర్ పట్టణంలో మున్సిపాలిటీ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ఇందులో భాగంగా వార్డులలో దోమల నివారణకు ఫాగింగ్ స్ప్రే (దోమల పొగ) పిచికారీ చేయిస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి వార్డులో దోమల నివారణ కోసం మున్సిపాలిటీ సిబ్బంది ద్వారా ఫాగింగ్ స్ప్రే పిచికారీ చేస్తున్నామని తెలిపారు. ఈరోజు ఒకటో వార్డులో ప్రారంభమైన ఈ ప్రక్రియ, మిగిలిన 12 వార్డులలోనూ సిబ్బంది రోజులవారీగా పూర్తి చేస్తారని ఆమె తెలిపారు.











