నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండల కేంద్రంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన సేవలను స్మరించుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భోల్లోజి నర్సయ్య మాట్లాడుతూ, పూలే సమానత్వం, విద్య కోసం చేసిన పోరాటాలు నేటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన బడుగు బలహీన వర్గాల విద్య కోసం 200 పాఠశాలలు ఏర్పాటు చేశారని తెలిపారు.
పూలే ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని, ఆయన సేవలను కొనియాడారు. ఈ వేడుకల్లో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆడెల్లి పోచమ్మ ఛైర్మెన్ భోజ గౌడ్, మార్కెట్ చైర్మన్ అబ్ధుల్ హాది, డిసిసి సభ్యులు రాజ్ మహమ్మద్, జిల్లా కిషన్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోతారెడ్డి, గ్రామ సర్పంచ్ కునేరు భూమన్న, సాయన్న, నాయకులు వీరయ్య, నారాయణ రెడ్డి, భూమారెడ్డి, జగదీష్, జ్ఞానేశ్వర్, నవీన్, సురేందర్, రమేష్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పూలే జీవితం, ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సమానత్వం, విద్య యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.








