ఢిల్లీ / చీరాల, 2026-06-05
దేశవ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు సుప్రీం కోర్ట్ ఒక కీలక తీర్పును వెలువరించింది. ఇకపై జర్నలిస్టులపై కావాలని కక్ష్యతో పెట్టే అక్రమ కేసులు చెల్లవని స్పష్టం చేసింది. నిజాలను నిర్భయంగా వార్తలు రాసేవారికి రక్షణ కల్పించింది.
దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు సుప్రీం కోర్ట్ శుభవార్తను అందించింది. పెన్ను పట్టి, వీడియో కెమెరా పట్టి తమ రోజువారీ వార్తలు, న్యూస్ ప్రసారాలు నిర్వహిస్తున్న వారందరూ జర్నలిస్టులేనని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది.
అక్రమ కేసులు చెల్లవు
ఇకపై రాజకీయ నాయకులు, అక్రమ సంపాదన దందాలు చేసేవారు, వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడేవారి బాగోతాలపై నిజాలను నిర్భయంగా వార్తలు రాసిన, న్యూస్ ప్రసారాలు చేసిన జర్నలిస్టులపై కావాలని కక్ష్యతో పెట్టే అక్రమ కేసులు చెల్లవని సుప్రీం కోర్ట్ పేర్కొంది.
జర్నలిస్టు సంఘాలకే అధికారం
శాటిలైట్ ఛానెల్స్, యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్, ప్రింట్ మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులు, ఆయా సంఘాల్లో సభ్యత్వం ఉన్నవారు ఎదుర్కొంటున్న కేసులు అక్రమమా లేక నిజ నిర్ధారణ కోసమా అనే విషయాన్ని ఆయా సంఘాల ద్వారా 7 రోజుల్లో పరిష్కరించుకునే హక్కు జర్నలిస్టు సంఘాలకే ఉంటుందని సుప్రీం కోర్ట్ తెలిపింది.
పోలీసులపై చర్యలు తప్పవు
జర్నలిస్టు సంఘాల ద్వారా పరిష్కారం కాకుండా, వారిని కాదని అక్రమ కేసులు పెట్టిన పోలీసులపై కఠిన చర్యలు తప్పవని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు భరోసా కల్పించింది.












