నల్గొండ, 3 September
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో, ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గురువారం మిర్యాలగూడలో భారీ నిరసన ప్రదర్శన, ధర్నా నిర్వహించింది.
ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భారీ నిరసన ప్రదర్శన, ధర్నా మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) పదేళ్ల పాలనలో జిల్లాకు బిఆర్ఎస్ తీరని అన్యాయం చేసిందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. బిఎల్ఆర్ ఆధ్వర్యంలో రైతుధర్నా'కు పోటీగా కాంగ్రెస్ గురువారం కేటీఆర్ గో బ్యాక్, గో బ్యాక్" అంటూ ప్లే కార్డులతో ఆందోళనకు శ్రీకారం చుట్టారు. మిర్యాలగూడ లో కాంగ్రెస్ జెండాలతో భారీ ప్రదర్శన నిర్వహించి, బస్టాండ్ ఎదుట ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు.బీఆర్ఎస్,కేటీఆర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు స్కైలాబ్ నాయక్ ఉపేందర్ రెడ్డి, చిలుకూరి బాలు, నూకల వేణుగోపాల్ రెడ్డి, గుడిపాటి నవీన్, తలకొప్పుల సైదులు, పర్వేజ్, కాంగ్రెస్ వన్ టౌన్ అధ్యక్షులు మోయిజ్, టూ టౌన్ అధ్యక్షులు కోడిరెక్క ఇంద్ర కుమార్, ఫారుక్ మొహమ్మద్, బెజ్జం సాయి, అజరుద్దీన్, దేశిడి శేఖర్ రెడ్డి, అయూబ్, ఇమ్రాన్, తో పాటు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు,బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.












