హనుమకొండ, 2026-06-05
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఓ పోలీసు అధికారి, సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని మహిళలను లక్ష్యంగా చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఫేస్బుక్ ద్వారా మహిళలతో పరిచయం పెంచుకుని, వారి వ్యక్తిగత పరిస్థితులను ఆసరాగా చేసుకుని లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు, బెదిరించి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై సబ్ ఇన్స్పెక్టర్ కదిరే శ్రీకాంత్‌ను హనుమకొండ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఓ పోలీసు అధికారి, సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని మహిళలను లక్ష్యంగా చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఫేస్బుక్ ద్వారా మహిళలతో పరిచయం పెంచుకుని, వారి వ్యక్తిగత పరిస్థితులను ఆసరాగా చేసుకుని లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు, బెదిరించి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై సబ్ ఇన్స్పెక్టర్ కదిరే శ్రీకాంత్‌ను హనుమకొండ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించి జైలుకు తరలించింది.
వివరాల్లోకి వెళితే
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలానికి చెందిన కదిరే శ్రీకాంత్ 2014 బ్యాచ్‌కు చెందిన ఎస్సై. వివాహితుడైన శ్రీకాంత్, సోషల్ మీడియా ద్వారా మహిళలకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపి, వారితో సన్నిహిత పరిచయాలు పెంచుకునేవాడని దర్యాప్తులో వెల్లడైంది. సుమారు 2025లో ఫేస్బుక్ ద్వారా ఓ మహిళతో పరిచయం పెంచుకున్న శ్రీకాంత్, అనంతరం ఆమెతో సన్నిహితంగా మెలిగినట్లు పోలీసులు తెలిపారు.
లైంగిక వేధింపులు, బెదిరింపులు
ఆ సమయంలో జమ్మికుంటలో విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్, బాధితురాలి వ్యక్తిగత పరిస్థితులను ఆసరాగా చేసుకుని ఆమెను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా, ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియో కాల్ రికార్డులను చూపించి బెదిరింపులకు పాల్పడినట్లు విచారణలో తేలింది. డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో పాటు, తాను ఇప్పటికే తీసుకున్న డబ్బును తిరిగి కోరినప్పుడు ప్రాణహాని కలిగిస్తానని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
పోలీసుల దర్యాప్తు
బాధితురాలు హనుమకొండ సుబేదారి పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదైన విషయం తెలుసుకున్న శ్రీకాంత్ పరారయ్యాడు. గోవా, హైదరాబాద్, నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో సుమారు నాలుగు నెలల పాటు తలదాచుకుని తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు తన మొబైల్ సిమ్ కార్డులను ధ్వంసం చేసి, కేవలం వైఫై ద్వారానే కమ్యూనికేషన్ కొనసాగించినట్లు వెల్లడైంది.
సాంకేతిక ఆధారాలతో అరెస్ట్
అయితే, సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు అతడి కదలికలను గుర్తించారు. చివరకు నిజామాబాద్‌లో శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని హనుమకొండకు తరలించినట్లు సుబేదారి సీఐ రంజిత్‌కుమార్ తెలిపారు.
మరో కేసు నమోదు












