పరకాల, వరంగల్, తెలంగాణ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 04
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తమ కుటుంబాన్ని రాజకీయంగా లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. వరంగల్ రాజకీయాల్లో తమ కుటుంబాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.
సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత విమర్శలు తమ కుటుంబాన్ని రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారని ఆరోపణ.. పరకాల నుంచి పోటీ చేసి చూపించాలని సవాల్ హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తమ కుటుంబాన్ని రాజకీయంగా లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. వరంగల్ రాజకీయాల్లో కొండా కుటుంబం కొనసాగుతున్న నేపథ్యంలో తమ కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సుస్మిత ఆరోపించారు. వేం నరేందర్‌రెడ్డి వరంగల్‌లో ఆధిపత్యం సాధించాలని చూస్తున్నారని, కొండా కుటుంబం రాజకీయాల్లో ఉంటే అది సాధ్యం కాదనే ఉద్దేశంతోనే తమ కుటుంబంపై రాజకీయ దాడులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం కాకుండా పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి చూపించాలని సీఎం రేవంత్‌రెడ్డికి సుస్మిత సవాల్ విసిరారు. రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించిన అక్రమాలపై తగిన ఆధారాలను దర్యాప్తు సంస్థలకు అందిస్తానని ఆమె పేర్కొన్నారు. ఈడీ, సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే రేవంత్‌రెడ్డి సోదరులకు సంబంధించిన వ్యవహారాలు, పొంగులేటి రాఘవ నిర్మాణ సంస్థ, జీహెచ్ఎంసీ నిధుల వ్యవహారాలపై కూడా కేసులు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తమ కుటుంబాన్ని రాజకీయంగా లక్ష్యంగా చేసుకుంటే తాము కూడా ప్రజల ముందు అన్ని విషయాలను వెల్లడిస్తామని సుస్మిత హెచ్చరించారు.












