తానూరు మండలంలోని బొంద్రట్ గ్రామంలో గోదాం నిర్మాణానికి 30 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ గ్రామస్తులకు అందజేశారు.
గోదాం నిర్మాణానికి నిధులు మంజూరు కావడంపై గ్రామ సర్పంచ్ రవీందర్ పటేల్ సంతోషం వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామ అభివృద్ధికి గతంలో తగినన్ని నిధులు అందలేదని, ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని సర్పంచ్ అన్నారు. దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నందుకు ఎమ్మెల్యే పటేల్‌ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శివ, వార్డు సభ్యులు యోగేష్ పటేల్, నాగేందర్ పటేల్, భోజరాం పటేల్, విఠల్, వెంకటేష్, పుండ్లిక్ రావ్, ఖాదీర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.












