షాద్నగర్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 01
ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడటాన్ని బీజేపీ షాద్నగర్ ఇన్చార్జ్ పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకనే కాంగ్రెస్ పార్టీ దాడులు, విధ్వంసాలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు.
ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడటాన్ని బీజేపీ షాద్నగర్ ఇన్చార్జ్ పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకనే కాంగ్రెస్ పార్టీ దాడులు, విధ్వంసాలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. అదేవిధంగా నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి గారి ఇంటిపై దాడికి పాల్పడటం అత్యంత హేయమైన, పిరికిపందల చర్య అని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లపై దాడులు చేయడం ద్వారా కాంగ్రెస్ నాయకులు ఏం సాధించాలనుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో రాజకీయంగా విభేదించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, కానీ వ్యక్తుల ఇళ్లపై, పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనని ఆయన అన్నారు.
కాంగ్రెస్ మొదలుపెట్టింది.. బీజేపీ ముగిస్తుంది అని పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని చేతగానితనంగా భావించవద్దని, దాడులకు పాల్పడితే బీజేపీ చట్టబద్ధంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో దీటైన సమాధానం ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.
అధికార మదంతో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేతలు వెంటనే తమ వైఖరిని మార్చుకోవాలని, లేదంటే ప్రజాక్షేత్రంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై, నల్లగొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి గారి ఇంటిపై దాడులకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
బీజేపీ కార్యాలయాలు, నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, ప్రతి దాడికి ప్రతీకార హింసకు కాకుండా చట్టబద్ధమైన, ప్రజాస్వామ్య పోరాటంతో దీటైన సమాధానం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.












