భైంసా పట్టణంలోని జీన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలో మోహన్ రావు పటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఏప్రిల్ 14న ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో మోహన్ రావు పటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటిల్ డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి, ఆయన ఆశయాలను స్మరించుకున్నారు.
డాక్టర్ అంబేద్కర్ స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటాలను ఆయన గుర్తు చేశారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
ఈ వేడుకల్లో ప్రజా ట్రస్ట్ సభ్యులు, లైబ్రరీ అభ్యర్థులు, కాసారి రామకృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు.








