బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి అమ్మవారి దర్శనం కోసం వచ్చిన ఒక భక్తురాలి ఐదేళ్ల కుమార్తె తప్పిపోయిన ఘటనలో పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. బాలికను సురక్షితంగా ఆమె తల్లి చెంతకు చేర్చారు.
ఆలయ సమీపంలోని వాటర్ ప్లాంట్ వద్ద బాలిక ఒంటరిగా ఏడుస్తూ కనిపించడంతో పెట్రోలింగ్ మొబైల్ విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ సంతోష్ ఆమెను గమనించారు. వెంటనే బాలికను తన ఆధీనంలోకి తీసుకుని, ఆమె తల్లి వివరాలు సేకరించారు.
సమాచారం సేకరించిన అనంతరం, హెడ్ కానిస్టేబుల్ సంతోష్ బాలికను ఆమె తల్లికి సురక్షితంగా అప్పగించారు. ఈ సంఘటనతో తల్లి ఆనందం వ్యక్తం చేశారు.
తప్పిపోయిన బాలికను సురక్షితంగా తిరిగి అప్పగించినందుకు తల్లితో పాటు ఆలయ భక్తులు పోలీసుల సేవలను ప్రశంసించారు.
బాలికను తల్లి చెంతకు చేర్చిన హెడ్ కానిస్టేబుల్ సంతోష్‌ను ఉన్నతాధికారులు, స్థానికులు అభినందించారు.


