నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో దివ్యాంగ పిల్లల కోసం నిర్మించనున్న భవిత కేంద్రం నిర్మాణానికి భూమిపూజ జరిగింది. ఈ కేంద్రం ప్రత్యేక అవసరాలున్న పిల్లల విద్యాభివృద్ధికి దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఈఓ మహేందర్, సర్పంచ్ కునేరు భూమన్న, ఉప సర్పంచ్ కృష్ణా రెడ్డి పాల్గొన్నారు. భవిత కేంద్రం ద్వారా దివ్యాంగ పిల్లలకు ప్రత్యేక విద్య, శిక్షణ, ఆటపాటలు, ఫిజియోథెరపీ వంటి సేవలు అందుబాటులోకి వస్తాయి.
ఈ కేంద్రం పిల్లల భవిష్యత్తుకు బాటలు వేయడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. సకాలంలో నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచనలు జారీ చేశారు.
ఈ కార్యక్రమానికి ఏఈ ఆంజనేయులు, నాయకులు కె. మహేష్, రాజు రెడ్డి, సందీప్ రెడ్డి, ఐఈఆర్సీ ఉపాధ్యాయులు, హనండ్లు, ప్రహ్లాద్ హాజరయ్యారు.


