బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 24
వర్షాకాలం నేపథ్యంలో భైంసా ఏరియా ఆసుపత్రిలో రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ఆదేశించారు. శుక్రవారం ఆయన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొని, వైద్య పరికరాలు, సౌకర్యాలపై అధికారులతో చర్చించారు.
వర్షాకాలం నేపథ్యంలో ఏరియా ఆసుపత్రిలో రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సూచించారు. శుక్రవారం భైంసా ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎమర్జెన్సీ కేసులలో అప్రమత్తంగా ఉండాలని, అందుకు అవసరమైన వైద్య పరికరాలు ఏమేం కావాలో అడిగి తెలుసుకున్నారు. ఒక్కో డాక్టర్ను పిలిచి, విభాగాల వారీగా కావాల్సిన సౌకర్యాలు, సమస్యలు ఏంటో తెలుసుకున్నారు. రోగులకు ఇబ్బందులు కలుగకుండా అందుకు అవసరమైన వాటిని సమకూరుస్తామని ఆయన చెప్పారు.
అదే విధంగా, భైంసా ఏరియా ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రి నుండి 150 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని కుభీర్ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా మార్చడం, భైంసాలో మెటర్నటి హాస్పిటల్ కావాలని ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందన్నారు.
త్వరలో ఇంచార్జి మంత్రితో సమావేశం ఉంటుందని, మంత్రి దృష్టికి పలు సమస్యలు తీసుకెళ్తామని తెలిపారు. సమావేశంలో సబ్ కలెక్టర్ అజ్మీరా సాంకేత్ కుమార్, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ కాశీనాథ్, మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తాత్రి, వైద్యులు పాల్గొన్నారు.












