హైదరాబాద్, 05-08-2026
05-08-2026 బుధవారం నాడు మేషం నుండి మీనం వరకు అన్ని రాశుల వారికి సంబంధించిన రాశిఫలాలను ఇక్కడ చూడవచ్చు. ప్రతి రాశికి సంబంధించిన ఆర్థిక, వృత్తి, కుటుంబ, ఆరోగ్య విషయాలపై ఈ ఫలాలు సూచనలు అందిస్తాయి.
మేషం: ఆదాయం తగినంతగా ఉండదు. ఉద్యోగంలో కీలక పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి వైద్య సంప్రదింపులు అవసరం కావచ్చు. దూర ప్రయాణ సూచనలున్నాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు మందకొడిగా సాగుతాయి.
వృషభం: కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం అవసరం.
మిధునం: దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ విషయాలలో జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలగవచ్చు. వృత్తి, ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి.
కర్కాటకం: రావలసిన సొమ్ము సకాలంలో వసూలవుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రువుల సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
సింహం: ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది.
కన్య: వృత్తి, వ్యాపారాలలో పని ఒత్తిడి అధికమై నిద్రహారాలు ఉండవు. ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ నిర్ణయాలు వ్యతిరేక ఫలితాలనిస్తాయి.
తుల: నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు.
వృశ్చికం: ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన అవసరం. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి.
ధనస్సు: కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. నిరుద్యోగులు అధికారుల అండదండలతో ఉన్నత అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలలో విశేషమైన లాభాలు పొందుతారు.












