✒️ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 22
దేశవ్యాప్తంగా పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.5,756.62 కోట్ల విలువైన 117 పర్యాటక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా పర్యాటక సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి.
దేశవ్యాప్తంగా పర్యాటక అనుసంధానాన్ని, సందర్శకుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు, ఆయా ప్రదేశాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. రూ.5,756.62 కోట్ల విలువైన 117 పర్యాటక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
పలు ప్రతిష్ఠాత్మక పథకాల కింద అమలు కానున్న ఈ ప్రాజెక్టులు పర్యాటక మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తాయి. తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో పాటు, స్థానిక ఆర్థిక వ్యవస్థలకు ప్రోత్సాహం లభిస్తుంది. ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా భారతదేశ ఆకర్షణను పెంచడం ఈ ప్రాజెక్టుల ముఖ్య లక్ష్యం.












