వాషింగ్టన్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 25
అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. కొత్తగా జారీ చేసే -1 వీసాలపై భారీగా ఫీజు విధించే ప్రతిపాదనను సోమవారం ప్రకటించింది. ఈ ప్రతిపాదన ప్రకారం, కొత్త -1 వీసాలకు 1,03,265 డాలర్ల (సుమారు రూ.86 లక్షలు) ఫీజు విధించనున్నట్లు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది.
అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. కొత్తగా జారీ చేసే -1 వీసాలపై భారీగా ఫీజు విధించే ప్రతిపాదనను సోమవారం ప్రకటించింది. ఈ ప్రతిపాదన ప్రకారం, కొత్త -1 వీసాలకు 1,03,265 డాలర్ల (సుమారు రూ.86 లక్షలు) ఫీజు విధించనున్నట్లు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. -1 వీసాదారుల్లో భారతీయులే అత్యధికంగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనపై తీవ్ర ఆసక్తి నెలకొంది.
ప్రతిపాదనపై అభిప్రాయ సేకరణ
తాజా ప్రతిపాదనపై 30 రోజులపాటు ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం నిబంధనను ఖరారు చేసే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది చివరి నాటికి కొత్త ఫీజు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. గతంలోనూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష డాలర్ల ఫీజును ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. అయితే, ఆ నిర్ణయాన్ని ఫెడరల్ కోర్టు అడ్డుకోవడంతో ప్రస్తుతం న్యాయపరమైన వివాదం కొనసాగుతోంది.
భారతీయులపైనే ఎక్కువ ప్రభావం
అమెరికా కంపెనీలు టెక్నాలజీ, ఇంజినీరింగ్, విద్య, పరిశోధన వంటి ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లోకి విదేశీ నిపుణులను తీసుకునేందుకు -1 వీసాలను ఉపయోగిస్తాయి. ఏటా 65 వేల సాధారణ -1 వీసాలు, అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసిన వారికి మరో 20 వేల వీసాలు అందుబాటులో ఉంటాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో జారీ చేసిన -1 వీసాల్లో దాదాపు 70 శాతం భారతీయులకే దక్కాయి. చైనా నిపుణులు 12 శాతంతో తర్వాతి స్థానంలో ఉన్నారు. దీంతో కొత్త ఫీజు భారతీయ నిపుణులపై భారీ ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.
ఫీజు వర్తించని అంశాలు
అయితే, ఇప్పటికే విద్యార్థి వీసాపై ఉన్న విదేశీయులు -1కు మారే సందర్భాల్లో, అలాగే ఇప్పటికే ఉన్న -1 వీసాల పునరుద్ధరణకు 1,03,265 డాలర్ల ఫీజు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మినహాయింపులు కొంతమందికి ఊరటనిచ్చే అంశం.
ట్రంప్ ప్రభుత్వం వాదన
-1 కార్యక్రమాన్ని కొన్ని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అమెరికన్ల స్థానంలో తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నాయని పేర్కొంటోంది. భారీ ఫీజు నేపథ్యంలో అమెరికన్ ఉద్యోగులను నియమించుకోవడం కంపెనీలకు మరింత ఆకర్షణీయంగా మారుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రతిపాదన ద్వారా దేశీయ ఉద్యోగాలను పరిరక్షించవచ్చని భావిస్తోంది.












