నిర్మల్, July 6
వర్షకాలం ప్రారంభం కావడంతో ప్రజలు అంటువ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దోమల వృద్ధి, నీటి నిల్వలు పెరగడం వల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వర్షకాలం ప్రారంభం కావడంతో ప్రజలు అనేక అంటు వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు. వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా లాంటి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇంటి పరిసరాల్లో కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాలు, కుండలు వంటి వాటిలో నీరు నిల్వ లేకుండా వారం వారం శుభ్రం చేయాలని సూచించారు. కిటికీలకు దోమల వలలు ఏర్పాటు చేసుకోవాలి. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు.
తాగునీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం అని వైద్యులు చెప్పారు. బావి, బోరు నీటిని మరిగించి, చల్లార్చి తాగాలి. బయట కలుషిత నీరు, మంచినీరు తాగడం వల్ల టైఫాయిడ్, కలరా, విరేచనాలు, వాంతులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. రోడ్డు పక్కన తెరిచి ఉంచిన తినుబండారాలు, కట్ ఫ్రూట్ లు తినవద్దని, ఇంట్లో వేడిగా వండిన ఆహారం తీసుకోవాలని సూచించారు.
వర్షంలో తడిసి రాగానే తల తుడుచుకుని పొడి బట్టలు ధరించాలి. చెప్పులు లేకుండా నడవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు, పాదాల పుండ్లు వచ్చే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. పిల్లలు వర్షపు నీటిలో ఆడుకోకుండా చూసుకోవాలి. గాయాలు ఉంటే వెంటనే యాంటిసెప్టిక్ పెట్టి కట్టు కట్టుకోవాలి.
జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రి, పిహెచ్సి, సిహెచ్సి లో ఉచిత చికిత్స పొందాలని, స్వీయ వైద్యం, యాంటీబయోటిక్ మాత్రలు వాడవద్దని వైద్యులు స్పష్టం చేశారు. ఆలస్యం చేయకుండా 104 హెల్ప్ లైన్ కు ఫోన్ చేయవచ్చని తెలిపారు.
వర్షాకాల వ్యాధుల నివారణకు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించడం వల్ల ఆసుపత్రులకు వెళ్లే అవసరం ఉండదని, ఆరోగ్యంగా ఉండవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కోరింది. ప్రజలు అవగాహనతో మెలగి సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.











